Reading Time: 2 minutes

Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

Caption of Image.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ పై అభిమానుల అంచనాలు అన్నీ ఇన్నీ కావు.  థియేటర్లలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.  బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే లేటెస్ట్ గా మరో కొత్త డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా..

నిజానికి ‘పెద్ది’ సినిమాను తొలుత రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయాలని భావించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో దానిని ఏప్రిల్ 30 వతేదీ వాయిదా వేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్న సమయంలో మరో సారి ఈ సినిమాను వాయిదా వేస్తూ మేకర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ తో తీవ్ర నిరాశ మిగిల్చారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచాయి. కానీ విడుదలలోనే తీవ్ర నిరాశను మిగుల్చుతుందన్న అభిప్రాయం ఫ్యాన్స్ లో వ్యక్తం అవుతోంది.

ఈ సారి పక్కానా?

‘పెద్ది’ సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను జూన్ 2026లో విడుదల చేస్తామని డేట్ చెప్పకుండానే సస్పెన్స్ లో ఉంచారు. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం జూన్ 4, 2026న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేట్రికల్ విడుదలతో పాటు పోస్ట్ థియేట్రికల్ డిల్స్ కూడా కీలకం. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్ధ నెట్ ఫ్లిక్స్ తో ఇప్పటికే ఒప్పందాలు పూర్తయ్యాయి. జూన్ 4 విడుదల తేదీకి నెట్‌ఫ్లిక్స్‌తో సహా కీలక భాగస్వాములందరూ ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీనివల్ల ఓటీటీ , థియేట్రికల్ రిలీజ్ మధ్య తగినంత సమయం ఉండేలా పక్కాగా ప్లాన్ చేశారు.

భారీ అంచనాలతో..

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుంది. వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై ఎలా ఉండబోతుందా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు .   కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ , బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆ వెంటనే చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్రారంభించనుంది. జూన్ నెలలో మెగా తుఫాను మొదలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.