Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీలో మండే ఎండ అలా మాయం.. ఇలా జోరు వర్షం

Caption of Image.

హైదరాబాద్ సిటీలో ఉదయం నుంచి భగభగ మండే ఎండ.. ఉక్కబోత. బయటకు కాలు పెట్టాలంటే భయం.. అంతటి ఎండ.. ఆకాశం వైపు తలఎత్తాలంటేనే కళ్లు మూసుకోవాల్సిందే.. ఆ రేంజ్ లో మండిపోయిన ఎండ.. ఒక్క సారిగా మాయం అయ్యింది. జస్ట్ 5 అంటే ఐదు నిమిషాల్లోనే ఎండ పోయింది.. వర్షం వచ్చింది.

చాలా చాలా ఆశ్చర్యం. 2026, ఏప్రిల్ 18వ తేదీ మధ్యాహ్నం 4 గంటల వరకు ఉన్న మండే ఎండ.. నిమిషాల్లోనే మాయం అయ్యింది. ఆకాశాన్ని మబ్బులు కమ్మేశాయి. ఆ వెంటనే 4 గంటల 10 నిమిషాల నుంచి జోరు వాన. 

హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, లక్డీకపూల్,  ట్యాంక్ బండ్,  హిమాయత్ నగర్,   ఖైరతాబాద్, చార్మినార్, ఆల్వాల్, కాప్రా, సికింద్రాబాద్ ఏరియాల్లో జోరు వర్షం పడింది. కొన్ని చోట్ల వర్షం.. సిటీలోని మరికొన్ని చోట్ల ఎండతో విచిత్ర వాతావరణం నెలకొంది. 

ఉరుము, మెరుపు, గాలులు ఏమీ లేకుండా వర్షం పడుతంది. ఉప్పల్ ఏరియాలో వర్షం పడటం లేదు. ఆకాశం మేఘావృతంగా ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నాయి. వర్షం పడినా జల్లులు మాత్రమే అని.. మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కావటంతో.. అప్పటికి వర్షం తగ్గి.. పిచ్ సాధారణ స్థితికి వస్తుందని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు.

©️ VIL Media Pvt Ltd.