Reading Time: < 1 minute

తెలంగాణలో మండుతున్న ఎండలు..ఈ 22 జిల్లాల వాళ్లు జాగ్రత్త.!

Caption of Image.

తెలంగాణ వ్యాప్తంగా  ఎండల దంచికొడుతున్నాయి. రాబోయే 48 గంటల పాటు తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 18 ఈరోజు  ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, జనగాం, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్,నారాయణపేట జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది

ఏప్రిల్ 19న  ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నారాయణపేట,  మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగనుంది.

వర్ష సూచన

అయితే అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. తూర్పు మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి (Trough) ప్రభావంతో.. రేపటి నుండి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.మహారాష్ట్ర , తెలంగాణ సరిహద్దుల్లో కొనసాగుతున్న యాంటీ సైక్లోనిక్ పరిభ్రమణం వల్ల రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈరోజు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి , కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.రేపు ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , కామారెడ్డి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

వచ్చే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం కూడా ఉండటంతో, రైతులు తమ పంటను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.