
దాదాపు 50 రోజుల నుంచి బంగారం, వెండి రేట్లలో స్థబ్దత కొనసాగుతూనే ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధం ప్రస్తుతానికి ముగింపునకు దగ్గరలోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రేట్లు ఒకరోజు పెరిగితే మరో రోజున తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో అక్షయ త—ృతీయకు ముందు వారాంతంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ నగరాల్లోని తాజా రేట్లను పరిశీలించటం మంచిది.
ఏప్రిల్18న బంగారం రేట్లు పెరిగాయి. ఏప్రిల్ 17 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.81 పెరుగుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 578గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 280గా కొనసాగుతోంది.
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్18, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.10వేలు పెరిగింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు పెరిగి రూ.2లక్షల 80వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.280గా అమ్మకాలు జరుగుతున్నాయి.