
ఎన్డీయే కూటమికి షాక్.. మోదీ సర్కార్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్ సభలో మొత్తం 528మంది ఎంపీలు ఓట్లు వేశారు.అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230ఓట్లు వచ్చాయి. రాజ్యాంగ సవరణకు మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే అనుకూలంగా 358ఓట్లు రావాల్సి ఉండగా.. కేవలం 288 ఓట్లు మాత్రమే వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ కు 54 ఓట్లు తగ్గాయి. దీంతో బిల్లు ఆమోదానికి కావాల్సిన మెజార్టీ రాకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు లింక్ ఉన్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా కోటాకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయడంతో విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించారు.
డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను బీజేపీ పరిగణలోకి తీసుకోకుండా 131 రాజ్యాంగ సవరణ బిల్లు మద్దతు కోసం సభలో ఓటింగ్ కు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అయితే మ్యాజిక్ ఫిగర్ ఓట్లు రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.
- లోక్ సభలో మొత్తం 489 మంది ఎంపీలు
- బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు
- వ్యతిరేకంగా 211 ఓట్లు
- రాజ్యాంగ సవరణకు దక్కని మూడింట రెండో వంతు మెజార్టీ
- మ్యాజిక్ ఫిగర్ 326 ఓట్లు రావాల్సి ఉండగా.. కేవలం 278 ఓట్లు మాత్రమే పోల్
- వీగిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు