Reading Time: < 1 minute

గంట టైమియ్యండి: కాంగ్రెస్ సవాల్‎ను స్వీకరించిన కేంద్ర మంత్రి అమిత్ షా

Caption of Image.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై లోక్ సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య చర్చ వాడీవేడిగా జరిగింది. మూడు బిల్లులపై చర్చకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం (ఏప్రిల్ 17) సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందు రెండు కీలక డిమాండ్లను పెట్టింది. డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టొదని.. అలాగే, డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలకు పెరుగుతాయన్న సీట్ల సంఖ్యను బిల్లులో పొందుపర్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

కాంగ్రెస్ రెండో డిమాండ్‎ను అమిత్ షా అంగీకరించారు. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రాలకు సీట్లను 50 శాతం పెంచుతామని అధికారిక సవరణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని.. ఈ వివరాలను బిల్లులో పొందుపర్చేందుకు ఒక గంట సమయం ఇవ్వాలని కోరారు. గంట టైమిస్తే సవరించిన బిల్లును సభలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు. సవరించిన బిల్లు కాపీని ప్రతి సభ్యుడికి అందిస్తామని.. ఇందులో ప్రభుత్వానికి దాచడానికి ఏమి లేదన్నారు.

►ALSO READ | వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు…. మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్‌

 సీట్లను 50 శాతం పెంచాలనే డిమాండ్ కారణంగానే డిలీమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ప్రతిపక్షాలను డిమాండ్ చేశారు. అదే వారి ఆందోళన అయితే గంటలో బిల్లును సవరిస్తామన్నారు. బదులుగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మూడు బిల్లులను తప్పనిసరిగా ప్రతిపక్షాలు ఆమోదించాలని షరతు పెట్టారు. 

©️ VIL Media Pvt Ltd.