Reading Time: 2 minutes

Shreyas Iyer: ఇదేం క్యాచ్ రా అయ్యా.. షాకైన రోహిత్, సూర్యకుమార్

Caption of Image.

Shreyas Iyer: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కిరాక్ క్యాచ్‌తో అందర్ని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌పై అయ్యర్ అదిరిపోయే క్యాచ్ పట్టుకున్నాడు. అతని స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు ముంబై జట్టు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ షాక్ అయ్యారు. ముంబై డగౌట్ సమీపంలోని బౌండరీ లైన్‌పై అయ్యర్.. జేవియర్ బార్ట్‌లెట్ సాయంతో ఈ కళ్లు చెదిరే క్యాచ్ కంప్లీట్ చేశాడు. ఈ అసాధారణమైన క్యాచ్‌ను దగ్గరగా చూసిన రోహిత్, సూర్య అవాక్కయ్యారు. శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌‌తో హార్దిక్ పాండ్యా(14) నిరాశగా మైదానం వీడాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మార్కో జాన్సెన్ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతిని భారీ సిక్సర్ బాదిన హార్దిక్ రెండో బంతిని డాట్ చేశాడు. మూడో బంతిని లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడబోయాడు.. కానీ సిక్సర్‌గా దూసుకొచ్చిన బంతిని బౌండరీ లైన్‌పై శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా అందుకొని చాకచక్యంగా గ్రౌండ్ లోపలికి విసిరేసాడు. అక్కడే ఉన్న బార్ట్‌లెట్ ఎలాంటి తప్పు చేయకుండానే క్యాచ్ అందుకున్నాడు. లెఫ్ట్ సైడ్ గాల్లోకి ఎగురుతూ బంతిని అందుకోవడంతో పాటు అంతే సమర్థవంతంగా అయ్యర్ లోపలికి విసిరేయడం అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. క్యాచ్ పూర్తయిన వెంటనే శ్రేయస్.. ఇప్పుడు అరవండంటూ ప్రేక్షకులను ఉద్దేశించి సైగలు చేశాడు. 

కాగా అప్పటి వరకు అరిచిన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్.. ఈ క్యాచ్‌తో సైలెంట్ అయ్యారు. దాంతో వారిని ఇంకా గట్టిగా అరవాలంటూ కోరాడు. ఈ క్యాచ్‌ను ముంబై డగౌట్‌లో కూర్చొని చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వాటే క్యాచ్ అంటూ ప్రశంసించారు. ‘ఇదేం క్యాచ్‌రా బాబు’అని సూర్యతో రోహిత్ శర్మ అంటున్నట్లు టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(60 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. నమన్ ధీర్(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీ చేశాడు.  

©️ VIL Media Pvt Ltd.