Reading Time: < 1 minute

తేజస్వీ ఖబడ్దార్.. తెలంగాణను అవమానిస్తే ఊరుకోం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Caption of Image.

పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తెజస్వీ ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. తెలంగాణపై విషం కక్కితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు వంశీకృష్ణ. పార్లమెంట్ చర్చ ఏందీ.. నువ్వు మాట్లాడింది ఏందీ అని ప్రశ్నించారు. పిచ్చి వాగుడు వాగితే ప్రజలు తరిమి కొడతారని అన్నారు. 

పబ్లిక్ ను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. తెలంగాణకోసం కొట్లాడింది కాంగ్రెస్.. ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తు చేశారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి రాష్ట్ర బీజేపీ నేతలు ఇలాంటి చిల్లర మాటలకు మద్దతునివ్వడం సిగ్గు చేటని మండపడ్డారు గడ్డం వంశీకృష్ణ. 

తెలంగాణ పోరాటంల  బీజేపీ పాత్ర ఏమాత్రం లేదు.తెలంగాణ కోసం పనిచేసేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించబోమని హెచ్చరించారు. 

రేపిస్టులను సపోర్టు చేసే పార్టీ బీజేపీ.. రేపిస్టులకు టికెట్లు ఇచ్చిన పార్టీ బీజేపీ.. మహిళలను చట్ట సభల్లోకి తెచ్చేందుకు ప్రోత్సహించారా.. ఏ మొహం పెట్టుకొని ఈ బిల్లు తెచ్చారని ప్రశ్నించారు గడ్డం వంశీకృష్ణ.   

©️ VIL Media Pvt Ltd.