Reading Time: < 1 minute

తెలంగాణలో 26.. ఏపీలో 38.. ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ

Caption of Image.

డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా..  నియోజకవర్గాల పునర్విభజనపై లోక్ సభలో   కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ. ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలని..డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. 

అమిత్ షా వెల్లడించిన అంచనాల ప్రకారం.. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న 129 ఎంపీ సీట్ల నుంచి ఏకంగా 195(23.97 శాతం)కు పెరగనున్నాయి. తమిళనాడులో 39 స్థానాల నుంచి 59కి (7.23%) పెరగనున్నాయి. కర్ణాటకలో 28 నుంచి 42 సీట్లకు (5.14%) పెరుగుతాయి. కేరళలో 16 నుంచి 20 (3.67%) స్థానాలకు పెరగనున్నాయి.

►ALSO READ | డీలిమిటేషన్ బిల్లు పేరుతో కేంద్రం కుట్ర.. సౌత్ కు అన్యాయం : ఎంపీ వంశీకృష్

 ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే  రెండు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం ఉన్న 42 సీట్లు 64కు పెరుగుతాయని అమిత్ షా ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్లో  25 సీట్ల నుంచి 38కి (4.65%) పెరుగుతాయని.. తెలంగాణలో  17 సీట్ల నుంచి 26(3.67%) కు పెరగనున్నాయని చెప్పారు. కేవలం సీట్ల పెంపు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా జరగబోయే జాతీయ జనాభా గణనలో భాగంగా కుల గణనను కూడా నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి ఈ సందర్భంగా  ప్రకటన చేశారు. 

©️ VIL Media Pvt Ltd.