
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్-ఇంటెన్సిటీకి కేరాఫ్ అడ్రస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. పోస్టర్ రిలీజ్ నుంచే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ హైప్ సొంతం చేసుకుని, ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవుతోంది.
భారీ డీల్‌కు డిజిటల్ హక్కులు?
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ‘స్పిరిట్’ ఓటీటీ హక్కులు ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్. అన్ని భాషల డిజిటల్ హక్కులను సుమారు రూ.250 కోట్లకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే, కొన్ని నివేదికలు జియోహాట్‌స్టార్ ఈ హక్కులను దక్కించుకుందని అంటున్నాయి.
ALSO READ : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లోకి బాలీవుడ్ బ్యూటీ..
ఇదే నిజమైతే, సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌గా అంచనా వేస్తున్న ఈ చిత్రానికి, దాదాపు సగం ఖర్చు కేవలం ఓటీటీ హక్కుల ద్వారానే రికవరీ అయినట్లే. అయితే, ఈ అంశంపై చిత్ర నిర్మాణ సంస్థ గానీ, ఓటీటీ సంస్థ గానీ అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అందువల్ల పూర్తి స్పష్టత కోసం వెయిట్ చేయాల్సి ఉంది.
You loved what existed before.
Now fall in love with what you never knew existed….#SPIRIT FIRST POSTER 🔥#OneBadHabit #Prabhas@imvangasandeep @tripti_dimri23 pic.twitter.com/J1Svt3E8uY— Spirit (@InSpiritMode) December 31, 2025
ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్..
సంక్రాంతి కానుకగా వచ్చిన ‘రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే ‘స్పిరిట్’ ద్వారా ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ క్రమంలో సందీప్ వంగా మార్కు వైలెన్స్, ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయోనని దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వీటికి తోడు ప్రభాస్-త్రిప్తిల ఫ్రెష్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చూడటానికి ప్రేక్షకులు మరీ ఉత్సాహంగా ఉన్నారు.
ALSO READ : అల్లు అర్జున్ ‘రాకా’లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ ?
Presenting you all, the antagonist of the film SPIRIT.
Mr. Vivek Anand Oberoi. pic.twitter.com/e0imSbSDmm— Sandeep Reddy Vanga (@imvangasandeep) February 27, 2026
‘స్పిరిట్’ రిలీజ్& టెక్నికల్ టీమ్
సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం అన్నీ తానే నిర్వహిస్తున్నారు. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2027 మార్చి 5న తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మాండరిన్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్ కానుంది.
‘యానిమల్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన నుంచి సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తంగా, ‘స్పిరిట్’ ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా నిలవబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Spirit release date 🙂#Spirit pic.twitter.com/PyUrDoxw7d
— Sandeep Reddy Vanga (@imvangasandeep) January 16, 2026