Reading Time: < 1 minute

డీలిమిటేషన్పై రౌండ్ టేబుల్ : కొత్తగా వచ్చే 300 మంది ఎంపీలు ఏం చేస్తారని పెంచుతున్నారు..? : దొంతి నర్సింహారెడ్డి

Caption of Image.

డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ పర్యావరణ వేత్త దొంతి నర్సింహారెడ్డి. పార్లమెంటు స్థానాలను 815 కు పెంచడంలో.. ప్రజలకు పనికొచ్చేది ఏం లేదన్నారు. పెంచుతున్న సీట్ల సంఖ్య ఎందుకు అనేది ఎవ్వరూ చెప్పడం లేదన్నారు. ఇప్పుడున్న 545 మంది ఎంపీలు చేస్తున్నది ఏంటి..? కొత్త సభ్యులు చేయడానికి ఏముంది అంటూ ప్రశ్నించారు. 2026 ఏప్రిల్ 16న హైదరాబాద్ లోని  బేగంపేట టూరిజం ప్లాజాలో  నిర్వహించిన సమాఖ్య రాజ్యాంగానికి తూట్లు పొడిచే డీ లిమిటేషన్ అనే అంశంపై అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

దొంతి నర్సింహారెడ్డి కామెంట్స్:

  • ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం ప్రధానమైనది
  • గత 30 ఏళ్లుగా స్థానిక ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి..
  • కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో కేంద్రీకృత పాలన సాగిస్తున్నారు
  • కేబినెట్ సమావేశాలు సైతం సీఎం, పీఎం సెంటర్ గా సాగిస్తున్నారు
  • ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 58 వేల ఒప్పందాలు మన దేశాన్ని శాసిస్తున్నాయి
  • అలాంటప్పుడు ఈ ఎంపీలను పెంచుకుని ఏం ప్రయోజనం..?
  • ప్రజల మీద ఆర్థిక భారం తప్పిదే మరేం లేదు
  • పార్లమెంట్ లో పని దినాల సంఖ్య తగ్గింది..
  • ప్రజా సమస్యల మీద చర్చ అసలు జరగడం లేదు
  • హైదరాబాద్ అభివృద్ధిలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీల పాత్ర ఏమిటి
  • అర్బన్ ప్రాంతాల్లో సీట్లు పెరుగుతాయి.. గ్రామీణంలో పెరిగేది లేదు
  • ఇలాంటప్పుడు గ్రామీణ ప్రాంత సభ్యుల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది
  • ఇప్పటికే మన గ్రామీణ ప్రాంత ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేనే లేదు
  • ఎంపీల సంఖ్య 815 మందికి చేరితే… అప్పుడు మాట్లాడేందుకు సభ్యులకు సమయం అస్సలే ఉండదు
  • ప్రతి సెన్సస్ తర్వాత సభ్యుల సంఖ్యను మార్చుకునే వెసులుబాటు..
  •  కొత్తగా చేస్తున్న డి లిమిటేషన్ డ్రాఫ్ట్ లో పెట్టారు.. ఇది ఇంకా దుర్మార్గం
  • రేవంత్ చెప్పిన ఫార్ములా బాగుందని అంటున్నారు
  • కానీ జీడీపీ అనేది కొలమానం కాదు..
  •  దీని మీద లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది
©️ VIL Media Pvt Ltd.