Reading Time: 2 minutes

అల్లు అర్జున్ ‘రాకా’లో షారుఖ్ ఖాన్ ఎంట్రీ ? అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా!

Caption of Image.

భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ సంచలనానికి తెరలేవబోతోంది. ‘పుష్ప’తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, మాస్ డెరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం ‘రాకా’ ( Raaka ) . ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పడు ఒక వార్త నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. బాక్సాఫీస్ బాద్‌షా షారుఖ్ ఖాన్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ మజా ఎలా ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. ఇప్పుడు ఆ ఊహే నిజం కాబోతోందన్న వార్తలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బాద్ షా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని చర్చ నడుస్తోంది.

‘జైలర్ 2’ కాదని ‘రాకా’ వైపు..

గత కొద్ది రోజులుగా రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం షారుఖ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. తన కూతురు సుహానా ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘కింగ్’ సినిమా కోసం తన కొత్త లుక్ ,  స్క్రీన్ ప్రెజెన్స్‌ను రిజర్వ్ చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. షారుఖ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అట్లీ – షారుఖ్ మ్యాజిక్ రిపీట్!

అయితే, అదే సమయంలో దర్శకుడు అట్లీపై ఉన్న గౌరవంతో అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’లో మాత్రం నటించేందుకు షారుఖ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది ‘జవాన్’తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన అట్లీ, షారుఖ్ ఖాన్ మధ్య ఇప్పుడు బలమైన అనుబంధం ఏర్పడింది. అందుకే అట్లీ కోరగానే షారుఖ్ కాదనలేకపోయారని సమాచారం. ఈ చిత్రంలో షారుఖ్ కేవలం అతిథి పాత్రలోనే కాకుండా, కథను మలుపు తిప్పే కీలకమైన సన్నివేశంలో కనిపిస్తారని టాక్.

Also Read : ఏలూరు బ్యాక్‌డ్రాప్‌లో భారీ పొలిటికల్ థ్రిల్లర్..

పాత బాకీ తీర్చుకుంటున్నారా?

గతంలో ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్ ఒక ముఖ్యమైన పాత్ర చేయాల్సి ఉంది. కానీ ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ బిజీ వల్ల బన్నీ ఆ అవకాశం కోల్పోయారు. ఇప్పుడు షారుఖ్ స్వయంగా బన్నీ సినిమాలో నటిస్తుండటంతో, అప్పటి లోటు ఇప్పుడు తీరబోతోందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ చేసిన ట్వీట్ కూడా దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ‘రాకా’ లుక్ అదిరిపోయింది.. ఇది మాస్ మాస్ మాస్ అంటూ షారుఖ్ పొగిడేశారు.

సైన్స్ ఫిక్షన్ వండర్‌గా ‘రాకా’

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. షారుఖ్, దీపికా ఇప్పటికే ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పఠాన్’, ‘జవాన్’ వంటి హిట్లతో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇక ‘రాకా’ సినిమాను హై-లెవల్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 2026లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు పుష్ప క్రేజ్, మరోవైపు షారుఖ్ మేనరిజానికి తోడుగా అట్లీ స్టైలిష్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ‘రాకా’ రికార్డులు సృష్టించడం ఖాయం అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.