Reading Time: < 1 minute

543 సీట్ల ఆధారంగా.. మహిళా రిజర్వేషన్ ఎందుకు అమలు చేయటం లేదు : ఎంపీ గౌరవ్ గగోయ్

Caption of Image.

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంటూ కేంద్రం డబుల్ గేమ్ ఆడుతుందని.. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ప్రస్తుతం ఉన్న 543 సీట్లున్న సభ ఆధారంగా.. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ఆమోదించటం లేదని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్. 

డీలిమిటేషన్ తో ముడిపెట్టి.. గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని బీజేపీ ప్రభుత్వాన్ని నేరుగా.. సభలోనే ప్రశ్నించారాయన. 2026 జనాభా లెక్కలు, కుల గణన ఆధారంగా అప్పుడు మళ్లీ రిజర్వేషన్ పెంచుకోవచ్చు కదా అని ప్రశ్నించారు గౌరవ్ గగోయ్. ఇప్పుడు 543 సీట్ల ఆధారంగా 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేద్దామని.. పూర్తిస్థాయి జన గణన తర్వాత ఆటోమేటిక్ గా మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయి కదా అని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. 

మహిళా రిజర్వేషన్ అమలు విషయంలో బీజేపీ ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తుందని.. డీలిమిటేషన్ తో ఎందుకు ముడిపెడుతుందని ప్రశ్నించారు ఎంపీ గౌరవ్ గగోయ్. 2023లోనే ప్రతిపక్షాల మాటను బీజేపీ ప్రభుత్వం విని ఉంటే.. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ అమలు అయ్యేదన్న విషయాన్ని గుర్తు చేశారాయన. 

 

©️ VIL Media Pvt Ltd.