Reading Time: < 1 minute

వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత.. బంట్వారం స్టేషన్‎కు కవిత తరలింపు

Caption of Image.

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిగి మండలంలోని రాపోల్, కాండ్లపూర్ గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా బుధవారం (ఏప్రిల్ 15) జాగృతి అధ్యక్షురాలు కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారధన్ మహారాజ్ ధర్నా చేపట్టారు. రైతుల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు ధర్నా విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. 

కేసులు పెడతామని బెదిరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ క్రమంలో జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో కవిత, విశాదరన్ మహారాజ్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవితను బంట్వారం పోలీస్ స్టేషన్‎కు, విశారదన్ మహరాజ్‎ను మర్పల్లీ పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

©️ VIL Media Pvt Ltd.