
చాయ్ షాట్స్ ఓటీటీలో వచ్చిన వర్టికల్ సిరీస్ ‘దందా’తో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దొర సాయి తేజ. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో దూసుకెళుతోంది.
ఈ సందర్భంగా దొర సాయి తేజ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో నేను పోషించిన అరవింద్ లాంటి ఛాలెంజింగ్ పాత్ర కోసం చాలాకాలంగా ఎదురుచూశా. నా క్యారెక్టర్‌కు వస్తోన్న రెస్పాన్స్ ఆనందాన్ని ఇస్తోంది. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు ఆదిత్య దేవులపల్లికే చెందుతుంది.
ఆయన నాపై పెట్టుకున్న నమ్మకమే అరవింద్ పాత్రను ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది. అందరిలోనూ స్పూర్తి నింపే కథల్ని, మంచి సందేశాన్ని ఇచ్చే ప్రాజెక్ట్‌ల్ని చేయాలనుకుంటున్నా” అని చెప్పాడు.