Reading Time: < 1 minute

ఆసియా ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్ అరిహాకు గోల్డ్ మెడల్

Caption of Image.

న్యూఢిల్లీ: ఆసియా ఏరోబిక్‌‌‌‌ జిమ్నాస్టిక్స్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సీనియర్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ వ్యక్తిగత విభాగంలో ఇండియా జిమ్నాస్ట్‌‌‌‌ అరిహా పంగంబం గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించింది. దాంతో ఈ టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి ఇండియన్‌‌‌‌ జిమ్నాస్ట్‌‌‌‌గా రికార్డులకెక్కింది.

శుక్రవారం జరిగిన ఫైనల్లో అరిహా మొత్తం 19.100 పాయింట్లు సాధించి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. ఆర్టిస్ట్రిలో 8.650, ఎగ్జిక్యూషన్‌‌‌‌లో 7.600, డిఫికల్టీలో 2.850 పాయింట్లు సాధించి మెడల్‌‌‌‌ను కైవసం చేసుకుంది. అరిహా అద్భుత విజయంపై ఇండియా జిమ్నాస్టిక్స్‌‌‌‌ సమాఖ్య ప్రెసిడెంట్‌‌‌‌ సుధీర్‌‌‌‌ మిట్టల్‌‌‌‌ హర్షం వ్యక్తం చేశాడు.

©️ VIL Media Pvt Ltd.