
మేడ్చల్ కలెక్టరేట్, పద్మారావునగర్, వెలుగు: మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ లో ఆషాఢ బోనాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భువనేశ్వరి మాత ఆలయంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, విజయేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పూజలు చేశారు.
బల్కంపేట ఎల్లమ్మకు బోనం..
బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని చెప్పారు. వేడుకల కోసం రూ.20 కోట్లు కేటాయించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.