
ఆదివాసీల హక్కులు, జీవో 3 కి ప్రత్యామ్నాయంగా కొత్త జీవో కోరుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ సంఘాలు, జేఏసీ పిలుపు మేరకు అరకులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గిరిజన సంఘాల పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త గిరిజన సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు శనివారం ( ఆగస్టు 8 ) బంద్ కు మద్దతుగా ర్యాలీ చేపట్టారు అనకాపల్లి గిరిజనులు.
జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని.. గిరిజనేతరులు సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్లపై ప్రభుత్వం ఇంప్లిడ్ అవ్వాలనీ,హైడ్రో పవర్ ప్రాజెక్టులు లో జి.ఓ లను రద్దు చేయాలనేది ప్రధాన డిమాండ్ గా బంద్ కు పిలుపునిచ్చాయి గిరిజన సంఘాలు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుండి అరకు రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. హోటళ్లూ, టిఫిన్ క్యాంటీన్లూ,టీ దుకాణాలు కూడా మూత పడ్డాయి. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కూడా పాఠశాలలు తెరుచుకోలేదు.
తెల్లవారుజామున అరకు నుండి బయలుదేరి మైదాన ప్రాంతాలకు వెళ్లే బస్సులు మాత్రమే నడిచాయి. పెట్రోల్ బంకులు, ప్రైవేటు లాడ్జిలు కూడా తెరుచుకోలేదు.పర్యాటక స్థలాలన్నీ మూతపడటంతో బంద్ విషయం తెలియక అరకు వచ్చిన పర్యాటకులు కొంత ఇబ్బందికి గురయ్యారు.
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం బంగారు బందలు నుండి కళ్యాణపులావ వరకు ర్యాలీ, ధర్నా నిర్వహించారు గిరిజనులు. అనకాపల్లి జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీలు స్థానిక గిరిజన సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్ జోగంపేట గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని… గిరిజన సాగులో ఉన్న భూములకు పట్టాల ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాదంపాడు రెవెన్యూ పరిధిలో గిరిజనకు ఇచ్చిన సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గిరిజనులకు అప్పగించాలని.. ఈ భూములపై జిల్లా జాయింట్ కలెక్టర్ గారు స్వయానా పరిశీలన చేయాలని కోరుతూ బంద్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు.