Reading Time: 3 minutes
Google Pixel 11 Series Price Specs Storage And Features Leaked Ahead Of August 12 Launch

Google Pixel 11 Series: గూగుల్ (Google) నుండి రాబోయే నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ఆగస్టు 12న నిర్వహించనున్న “మేడ్ బై గూగుల్ (Made by Google)”ఈవెంట్‌లో లాంచ్ కు సిద్ధమవుతోంది. అయితే ఈ ఈవెంట్‌కు ముందే ఈ సిరీస్ లో రాబోతున్న Pixel 11, Pixel 11 Pro, Pixel 11 Pro XL, Pixel 11 Pro Fold స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన ధరలు, స్టోరేజ్ వేరియంట్లు, కలర్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.

గూగుల్ అమెజాన్ స్టోర్‌లో ఈ ఫోన్లకు సంబంధించిన కొన్ని రిటైలర్ లిస్టింగ్స్ కొద్దిసేపు కనిపించి ఆ తర్వాత మాయమయ్యాయి. అయితే అప్పటికే వాటి స్క్రీన్‌షాట్లు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ వివరాలను గూగుల్ అధికారికంగా ధృవీకరించపోయినప్పటికీ లీకైన సమాచారం ప్రకారం.. Pixel 11 సిరీస్‌లో 128GB బేస్ స్టోరేజ్‌కు గూగుల్ స్వస్తి చెప్పి, అన్ని మోడళ్లలో 256GB స్టోరేజ్‌ను బేస్ వేరియంట్‌గా తీసుకురాబోతున్నారు.

Google Pixel 11:

లీక్ ప్రకారం గూగుల్ పిక్సెల్ 11 256GB స్టోరేజ్ వేరియంట్ ధర $899గా ఉండనుంది. ఇది భారత కరెన్సీలో ఇది సుమారు రూ.80,000. 512GB వేరియంట్ ధర $1,019గా ఉండొచ్చని సమాచారం. రెండు వేరియంట్లలోనూ 12GB RAM ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే, 2,856 x 1,280 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో Tensor G6 చిప్‌సెట్‌తో పాటు Titan M3 సెక్యూరిటీ చిప్‌ను ఇందులో అందించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్ లో 4,985mAh బ్యాటరీ, 13MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని లీకులు పేర్కొంటున్నాయి.

Google Pixel 11 Pro:

పిక్సెల్ 11 ప్రో 256GB బేస్ వేరియంట్ ధర $1,099గా ఉండొచ్చని సమాచారం. అంటే భారత కరెన్సీలో రూ.98,000. 512GB మోడల్ ధర $1,219, 1TB వేరియంట్ ధర $1,449గా ఉండే అవకాశం ఉంది. అలాగే RAM విషయంలో కూడా గూగుల్ మార్పు చేయనున్నట్లు లీకులు చెబుతున్నాయి. 256GB వేరియంట్‌లో 12GB RAM, 512GB, 1TB వేరియంట్లలో 16GB RAM ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఇందులో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే, 2,856 x 1,280 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. 4,850mAh బ్యాటరీతో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండొచ్చని సమాచారం. కెమెరా విభాగంలో 50MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, 48MP 5x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఫోన్‌లో గరిష్టంగా 120x డిజిటల్ జూమ్ సపోర్ట్ కూడా లభించవచ్చని లీకులు చెబుతున్నాయి.

Image (1)

Pixel 11 Pro XL:

ఈ సిరీస్‌లో పెద్ద స్క్రీన్‌తో రానున్న పిక్సెల్ 11 ప్రో XL 256GB వేరియంట్ ధర $1,299గా ఉండొచ్చని సమాచారం. అంటే సుమారు రూ.1.16 లక్షలు. 512GB మోడల్ ధర $1,419, 1TB వేరియంట్ ధర $1,649గా ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.8 అంగుళాల OLED డిస్‌ప్లే, 2,992 x 1,344 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇతర Pixel 11 మోడళ్ల మాదిరిగానే ఇందులోనూ Tensor G6 చిప్‌సెట్ ఉండనుంది. ఇక ఇందులో 5,115mAh బ్యాటరీ, 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండొచ్చని సమాచారం. కెమెరా విషయంలో Pixel 11 Pro తరహాలోనే ట్రిపుల్ కెమెరా సెటప్, 120x వరకు డిజిటల్ జూమ్, 13MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

Pixel 11 Pro Fold:

గూగుల్ నుండి రాబోయే ఫోల్డబుల్ ఫోన్ Pixel 11 Pro Fold సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. లీక్ ప్రకారం 256GB వేరియంట్ ధర $1,899గా, అంటే సుమారు రూ.1.69 లక్షలుగా ఉండొచ్చు. 512GB మోడల్ ధర $2,019, 1TB వేరియంట్ ధర ఏకంగా $2,249గా ఉండే అవకాశం ఉంది. Pixel 11 Pro Foldలో 6.5 అంగుళాల ఔటర్ OLED డిస్‌ప్లే, సుమారు 8 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే ఉండనున్నాయి. రెండు స్క్రీన్లలోనూ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండొచ్చు. అన్ని స్టోరేజ్ వేరియంట్లలో 16GB RAM అందించే అవకాశం ఉంది. ఫోల్డబుల్ ఫోన్‌లో 4,750mAh బ్యాటరీ, 30W వైర్డ్ ఛార్జింగ్, Qi2 వైర్‌లెస్ ఛార్జింగ్, Wi-Fi 6E వంటి ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అలాగే ఇది ట్రిపుల్ రియర్ కెమెరా, 13MP ఫ్రంట్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. పైన్, మిడ్ నైట్ కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి.

గూగుల్ అధికారికంగా ఆగస్టు 12, 2026న మేడ్ బై గూగుల్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో Pixel 11 సిరీస్‌ను అధికారికంగా ప్రకటించనుంది. అయితే ప్రస్తుతం లీకైన ధరలు, స్పెసిఫికేషన్లు అధికారికంగా ధృవీకరించబడలేదు.