
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) టెక్నీషియన్, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 433.
విభాగాల వారీగా ఖాళీలు: టెక్నీషియన్ అప్రెంటిస్ 156, ట్రేడ్ అప్రెంటిస్/ ఐటీఐ 104, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 104, ట్రేడ్ అప్రెంటిస్ – డేటా ఎంట్రీ ఆపరేటర్ 69.
ఎలిజిబిలిటీ
టెక్నీషియన్ అప్రెంటిస్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్: ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ నుంచి సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీబీఏ/ బీఏ/ బి.కాం/ బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
ట్రేడ్ అప్రెంటిస్– డేటా ఎంట్రీ ఆపరేటర్: 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి. డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్లో స్కిల్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 7.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iocl.com/apprenticeshipsను సందర్శించండి.