
మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు నటుడు పరేష్ రావల్. ఇందులో లింగం మాయ్యా అంటూ చిరు ఓ రేంజ్ లో ఆడుకున్న సంగతి తెలిసిందే. విలన్ పాత్రలతోపాటు కామెడీ సీన్స్ లోనూ అలరించారు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన క్షణం క్షణం సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత మనీ, గోవిందా గోవిందా, మనీ మనీ, రిక్షావోడు, బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. పరేషన్ రావల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ అంతగా తెలియదు. కానీ మీకు తెలుసా..? ఆయన భార్య ఒకప్పుడు మిస్ ఇండియా. అవును.. ఆమమె పేరు స్వరూప్ సంపత్. 1979లో మిస్ ఇండియాగా కిరీటం అందుకున్నారు. ఆ తర్వాత ఆమె పలు సీరియల్స్, సినిమాల్లో నటించారు. వీరిద్దరి ప్రేమకథ ఏ సినిమాకు తీసిపోదు.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
స్వరూప్ సంప్త.. నరం గరం, యే జో జిందగీ హై సినిమాలు, సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వోర్సెస్టర్ విశ్వవిద్యాలయం నుండి ‘అభ్యసన వైకల్యాలున్న పిల్లలలో జీవిత నైపుణ్యాలను పెంపొందించడానికి నాటకాన్ని ఉపయోగించడం’ అనే అంశంపై తన థీసిస్‌ను పూర్తి చేసి పిహెచ్.డి పట్టా పొందారు. 1979లో మిస్ ఇండియా పోటీలో పాల్గొని, కిరీటం గెలుచుకున్న తర్వాత మిస్ యూనివర్స్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఆమెకకు ‘యే జో హై జిందగీ సీరియల్ పెద్ద బ్రేక్ ఇచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
పరేష్ రావల్, స్వరూప్ సంపత్ ప్రేమకథ…
స్వరూప్, పరేష్ రావల్‌ల ప్రేమకథ ఏ సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు. వీరిద్దరూ వేర్వేరు కళాశాలల్లో చదువుకునేవారు. పరేష్, స్వరూప్‌ను చూసిన రోజే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. వారి మొదటి పరిచయం గురించి ఒక ఇంటర్వ్యూలో స్వరూప్ మాట్లాడుతూ, తాము ఒక అంతర్ కళాశాల పోటీలో కలుసుకున్నామని, మొదటి పరిచయంలోనే అతను తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపింది. పరేష్ తన స్నేహితుడికి స్వరూప్ గురించి చెప్పినప్పుడు, ఆమె తాను పనిచేసే కంపెనీ యజమాని కూతురని అతను చెప్పాడు. అయినా ఆ విషయం పరేష్‌ను ఏమాత్రం కలవరపెట్టలేదు. ఆ జంట 12 సంవత్సరాల పాటు (1975 నుండి 1987 వరకు) ప్రేమించుకుని, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. వీరికి ఆదిత్య, అనిరుధ్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
స్వరూప్ సంపత్..
Swaroop Sampat
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..