Reading Time: < 1 minute

ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలు పెంచుకోవాలని చాలామందికి ఉంటుంది. కానీ స్థలం లేకపోవడం, సమయం కుదరకపోవడంతో ఆ ఆలోచన పక్కన పెట్టేస్తుంటారు. అలాంటి వారికి ‘మైక్రోగ్రీన్స్’ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. బాల్కనీ లేదా ఇంట్లోనే చాలా తక్కువ స్థలంలో, విత్తనాలు వేసిన వారం లేదా పది రోజుల్లోనే వీటిని పెంచుకోవచ్చు. ఎంతో పోషకాలున్న మైక్రోగ్రీన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సూపర్ ఫుడ్ బ్రోకలీ మైక్రోగ్రీన్స్: బ్రోకలీ విత్తనాలు చల్లిన 8 నుంచి 10 రోజుల్లోనే ఇవి కోతకు వస్తాయి. వీటిలో విటమిన్లు, క్యాన్సర్ నిరోధక సల్ఫోరాఫేన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక వీటిని క్యాబేజీ, క్యారెట్, నిమ్మరసంతో కలిపి రుచికరమైన సలాడ్‌గా తీసుకోవచ్చు.

ఘాటైన ఆవాల, ముల్లంగి మైక్రోగ్రీన్స్: ఆవాలు, ముల్లంగి విత్తనాల ద్వారా పెరిగే మైక్రోగ్రీన్స్ వారం నుంచి పది రోజుల్లో తయారవుతాయి. ఇక ఇవి స్వల్పంగా ఘాటు రుచితో ఉండి విటమిన్ సీ, పొటాషియం, ఖనిజాలను అందిస్తాయి. వీటిని టమోటా, కీరా, మిరియాల పొడితో కలిపి తింటే చాలా బాగుంటాయి.

Fresh Microgreens at Home: Easy 7-Day Balcony Growing Guide
Fresh Microgreens at Home: Easy 7-Day Balcony Growing Guide

పోషకాల గని సన్‌ఫ్లవర్ మైక్రోగ్రీన్స్: సన్‌ఫ్లవర్ మైక్రోగ్రీన్స్ కొద్దిగా తీపి రుచి కలిగి పాలకూరలా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా లభిస్తాయి. ఇక వీటిని పనీర్, టోఫు లేదా అవకాడోతో కలిపి హెల్దీ సలాడ్‌గా తయారుచేసుకోవచ్చు.

రంగుల తోటకూర మైక్రోగ్రీన్స్: తోటకూర మైక్రోగ్రీన్స్ రెండు వారాల్లో కోతకు వస్తాయి. ఎరుపు, మెజెంటా రంగుల్లో ఉండే ఈ చిన్న మొక్కల్లో విటమిన్లు, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇక ఇవి సలాడ్లకు మంచి రంగును, రుచిని ఇస్తాయి.

ఇక తక్కువ స్థలం, తక్కువ సమయంలోనే ఇంటి వద్ద పెరిగే మైక్రోగ్రీన్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సలాడ్లు, శాండ్‌విచ్‌లలో వీటిని భాగం చేసుకుని తింటే శరీరానికి అవసరమైన పోషకాలన్నీ సులభంగా లభిస్తాయి.

గమనిక: మైక్రోగ్రీన్స్ పెంచేటప్పుడు నాణ్యమైన విత్తనాలు, పరిశుభ్రమైన నీటిని మాత్రమే ఉపయోగించాలి. క్రమం తప్పకుండా వీటికి తగినంత వెలుతురు తగిలేలా చూసుకోవడం మంచిది.

The post బాల్కనీలోనే వారం రోజుల్లో తాజా మైక్రోగ్రీన్స్‌! appeared first on Manalokam – Latest Telugu News & Updates.