Reading Time: 2 minutes

Samantha: కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. వైరల్ వీడియో చూసి ఫ్యాన్స్ ఎమోషనల్!

Caption of Image.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో అభిమానులను ఆకట్టుకుంది. ఆగస్టు నెలలో తనకు ఎదురైన హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ఫేజ్‌ను ఆస్వాదిస్తున్న సామ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బ్యూటీఫుల్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్‌లో సమంత ఏడుస్తున్నట్లు కనిపించిన ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో సామ్ నిజంగానే ఏడ్చిందా? ఆ వీడియోలో అసలు ఏం జరిగింది? అంటూ అభిమానులు ఆసక్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ సమంత షేర్ చేసిన ఆ వీడియో వెనుక అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆగస్టు డంప్‌లో ఫోటో మాత్రం స్పెషల్..

సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె తన ఆగస్టు నెలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో ఓ స్పెషల్ పోస్ట్ ద్వారా ఆకర్షించింది. ఇందులో జిమ్ వర్కౌట్స్, ఫ్రెండ్స్‌తో సరదా క్షణాలతో పాటు ఆమె పడి పడి నవ్వుతున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంది. అయితే మాతృత్వానికి సంబంధించిన ‘Ina May’s Guide to Childbirth’ పుస్తకాన్ని చదువుతున్న ఫోటో మాత్రం ప్రత్యేకంగా వైరల్ అవుతోంది.

అలాగే, ఓ వీడియోలో ఆమె పడి పడి నవ్వుతూ కనిపించారు. అయితే, అది చూడగానే ఏడుస్తున్నట్లుగా ఉంది. దీంతో సామ్ ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది? అని సామ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కానీ, ఓ సరదా సన్నివేశానికి అంతగా నవ్వడంతోనే సమంత కళ్లలో నీళ్లు (హ్యాపీ కన్నీళ్లు) తిరిగాయని క్లారిటీ వచ్చింది. ఈ సహజమైన, సరదా క్షణం అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. దీంతో సమంత ఎందుకు అంతగా నవ్వుతోందంటూ నెటిజన్లు ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు.

జిమ్‌లోనూ ఫిట్‌నెస్‌పై ఫోకస్..

ఆగస్టు నెల డంప్‌లో సమంత జిమ్‌లో ఉన్న ఫోటో కూడా ఉంది. వర్కౌట్ దుస్తుల్లో జిమ్‌లో పోజులిచ్చిన ఆమె.. తన ఫిట్‌నెస్ రొటీన్‌ను కొనసాగిస్తున్నట్లు ఈ ఫోటో ద్వారా మరోసారి చూపించారు. స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు, పలు వ్యక్తిగత క్షణాలకు సంబంధించిన చిత్రాలను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు.

డిసెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్న సమంత?

సమంత, రాజ్ నిడిమోరి దంపతులు ఈ ఏడాది డిసెంబర్‌లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సమయంలో సమంత, రాజ్ నిడిమోరికి పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ ఆగస్టు డంప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్ వర్కౌట్స్, స్నేహితులతో సరదా క్షణాలు, వేడుకలు, మాతృత్వానికి సంబంధించిన పుస్తకం, ఆపుకోలేని నవ్వుతో కూడిన ఈ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సమంత తన జీవితంలోని ఈ కొత్త దశను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నట్లు ఈ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తెరకెక్కించిన మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. 

©️ VIL Media Pvt Ltd.