
హైదరాబాద్: రాజస్థాన్ టూ హైదరాబాద్ డ్రగ్ నెట్వర్క్ను ఈగల్ ఫోర్స్ టీమ్ గుట్టురట్టు చేసింది. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 1.031 కిలోల ఓపియం, 25 గ్రాముల ఎండీఎం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీజ్ చేసిన డ్రగ్స్ విలువు రూ.12.65 లక్షలు ఉంటుందని తెలిపారు అధికారులు.
హైదరాబాద్‌లో యువతే టార్గెట్‌గా డ్రగ్స్ ముఠాల కార్యకలాపాలు కొనసాగిస్తోంది. రాజస్థాన్ నుంచి బస్సులు, రైళ్లు, కార్లలో డ్రగ్స్ తరలించి ఇక్కడి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం (ఆగస్ట్ 8) క్వాంటమ్ లీప్ స్కూల్ సమీపంలో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు.
మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి దగ్గరి నుంచి 1.031 కిలోల ఓపియం, 25 గ్రాముల ఎండీఎం స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో యువతను కొరియర్లు, డెలివరీ ఏజెంట్లుగా వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ లింకులతో 2023 నుంచి ఇప్పటి వరకు 78 డ్రగ్ ట్రాఫికింగ్ ప్రయత్నాలను భగ్నం చేశారు పోలీసులు.