Reading Time: < 1 minute

ఫోర్జరీ నిరూపిస్తే జైలుకెళ్లేందుకు సిద్ధం..హైందవి విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ యాదవ్

Caption of Image.

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: హైందవి జూనియర్ కళాశాల అక్రమాలకు పాల్పడలేదని హైందవి విద్యాసంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఏడాది ఫైర్ సేఫ్టీ కోసం తమ కాలేజీ నుంచి ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదని.. గతేడాది జీహెచ్ఎంసీకి మాత్రమే అప్లై చేశామని తెలిపారు. శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫైర్ సేఫ్టీ కోసం తాము హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశామన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఫోర్జరీ చేసినట్లు నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు సిద్ధమని పేర్కొన్నారు. తమ కళాశాలలను కొంతమంది కావాలనే టార్గెట్​చేసి, బద్నామ్ చేస్తున్నారని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.