Reading Time: < 1 minute

మరీ ఇంత హార్ష్ కొటేషన్ ఏంటన్నా.. ఈ ఆటో ఎప్పుడైనా మీ కంట పడిందా..?

Caption of Image.

ఆటోలపై కొటేషన్లకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో కొందరు ఆటో డ్రైవర్లు తమకు నచ్చింది రాయిస్తున్నారు. ‘హాయ్ చెప్పి ఆశ పెట్టకు.. బాయ్ చెప్పి బాధ పెట్టకు’’ లాంటి కొన్ని రాతలు సరదాగా అనిపించినా.. కొన్ని రాతలు శ్రుతిమించుతున్నాయి. ‘‘HORN కోట్టకు రా ముండా కోడకా.. దారి ఉంటే ముందుకు నేనేపోతా’’ ఈ రాతలు ఒక ఆటో వెనుక కనిపించాయి. ఈ ఆటో ఎక్కడో కాదు మన తెలంగాణలోనే తిరుగుతుంది.

ఈ రాతలు ఆటో వెనుక వెళ్లే ప్రయాణికులను ఉద్దేశించి రాసినవని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని “Don’t Horn, Go Slow” అని పద్ధతిగా కూడా చెప్పొచ్చు. లేదు.. తెలుగులోనే చెప్పాలనుకుంటే.. ‘‘హార్న్ కొట్టొద్దు అన్నా.. దారి ఉంటే ముందుకు నేనేపోతా’’ అని కూడా రాయించొచ్చు. కానీ.. ఈ ఆటో డ్రైవర్ మాస్.. ఊర మాస్ అనే ధోరణిలో బూతు రాయించి నీతి బోధిస్తున్నట్లు రోడ్లపై తిరుగుతున్నాడు.

‘‘నన్ను చూసి ఏడవకన్నా.. అప్పు చేసి కొన్నా’’ లాంటి సరదా రాతలు పర్లేదు గానీ ఇలా బూతులు రాయించి ఏదో గొప్ప పని చేశామనే భావనలో కొందరు ఆటో డ్రైవర్లు ఉంటున్నారు. సమాజానికి ఏదో నీతి చెప్పామనే ఫీలింగ్లో బూతులను బహిరంగంగా ప్రచారం చేస్తున్నారు. సినిమాల్లో, సామాజిక మాధ్యమాల్లో బూతులు సర్వ సాధారణమైన ఈరోజుల్లో కొందరు ఆటో డ్రైవర్లు ఈ తరహా రాతలు రాయించడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అయితే.. మరీ బూతుల డోస్ ఎక్కువై తోటి ప్రయాణికులను కించపరచడం, అవమానించేలా ఉండటం విపరీత పోకడలకు నిదర్శనం.

©️ VIL Media Pvt Ltd.