Reading Time: 2 minutes

ఎంత చదివినా మైండ్‌లోకి ఎక్కట్లేదా ? పర్మినెంట్‌గా గుర్తుండడానికి ఈ స్టడీ ట్రిక్స్ ట్రై చేయండి!

Caption of Image.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామందికి ఒక పెద్ద సమస్య ఉంటుంది. ఎంత బాగా ప్రిపేర్ అయినా, ఎగ్జామ్ హాల్‌కి వెళ్లేసరికి చదివిన విషయాలు గుర్తుకురావు. ఒకోసారి పుస్తకాలు మూసేయగానే అన్నీ మర్చిపోతుంటాం.

మీకు కూడా ఇలాగే జరుగుతోందా ? అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చదివి సైంటిఫిక్‌గా ప్రూవ్ అయిన ఈ 5 బెస్ట్ స్టడీ టెక్నిక్స్ పాటిస్తే, మీ మెమరీ పవర్ పెరిగి చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం!

1. SQ3R టెక్నిక్ 
ఏదైనా కొత్త పాఠం లేదా టాపిక్ చదివేటప్పుడు ఈ పద్ధతి సూపర్‌గా పనిచేస్తుంది. మొదట చదవబోయే చాప్టర్‌ని ఒకసారి పైపైన(Survey) బాగా గమనించండి. ఆ చాప్టర్ హెడ్డింగ్స్ చూసి మీలో మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోండి.  ఇప్పుడు పాఠాన్ని పూర్తిగా చదవండి.  ఇక మీరు వేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయో లేదో చెక్ చేసుకోండి. చివరగా, చదివినదంతా మరోసారి మనసులో రివైజ్ చేసుకోండి. 

2. స్పేస్డ్ రిపీటేషన్ 
ఒకేరోజు అంతా చదివి వదిలేయడం కంటే, గ్యాప్ ఇచ్చుకుంటూ చదివితే మెదడులో సమాచారం పర్మినెంట్‌గా స్టోర్ అవుతుంది. మొదట క్లాస్‌లో లేదా బుక్‌లో చెప్పిన విషయం బాగా అర్థం చేసుకోండి. దానిని రెండో రోజు ఒకసారి రివైజ్ చేయండి. మళ్లీ మూడో రోజు ఒకసారి చూడండి. ఆ తర్వాత వారం లేదా పది రోజులకి ఒకసారి మళ్ళీ రివిజన్ చేయండి. ఇలా చేస్తే ఆ విషయం ఎప్పటికీ మర్చిపోరు.

3. PQ4R పద్ధతి (నోట్స్ & రివిజన్ ట్రిక్)
ఇది పెద్ద పెద్ద పాఠాలను సులభంగా గుర్తుంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. ముందుగా పాఠంలోని హెడ్డింగ్స్, సబ్-హెడ్డింగ్స్ చదవండి. పాఠం చదివే ముందే, ఈ టాపిక్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో ప్రశ్నలు రాసుకోండి. ఆ తర్వాత పాఠాన్ని శ్రద్ధగా చదవండి. చదివిన ముఖ్యమైన పాయింట్లని మీ సొంత మాటల్లో అర్ధం చేసుకోండి. మీ నోట్స్‌లో వాటిని సొంతంగా రాసుకోండి. చివరగా, హెడ్డింగ్స్ చూస్తూ మొత్తం పాఠాన్ని ఒకసారి రివైజ్ చేసుకొండి. 

4. ఫేమాన్ టెక్నిక్ (నేర్పించడం ద్వారా నేర్చుకోవడం)
ఏదైనా కఠినమైన టాపిక్ ఉంటే, దానిని ఎవరికైనా సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ట్రిక్ బెస్ట్. ముందుగా ఆ టాపిక్‌ని బాగా చదవండి. ఆ తర్వాత, ఆ విషయాన్ని మీకు మీరే లేదా మీ ఫ్రెండ్‌కి ఎవరికీ అర్థం కాని కఠినమైన పదాలు వాడకుండా, చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో వివరించడానికి ప్రయత్నించండి. అలా చెప్పేటప్పుడు మీరు ఎక్కడైనా ఇబ్బంది పడినా, తప్పుగా చెప్పినా.. ఆ పుస్తకం తెరిచి ఆ డౌట్‌ని క్లియర్ చేసుకోండి. అంతే, ఆ టాపిక్ మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది.

ALSO READ : ఇంట్లో చెప్పులేసుకుంటే దరిద్రం అంటారు కానీ..

5. మైండ్ మ్యాపింగ్ (ఫోటోస్, కలర్స్‌తో చదవడం)
చదవడం బోర్ కొట్టినప్పుడు ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక తెల్ల కాగితం తీసుకుని, దాని మధ్యలో మీరు చదవాలనుకుంటున్న టాపిక్ పేరు రాయండి. ఆ టాపిక్‌కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ చుట్టూ గీతలు గీసి బ్రాంచ్‌లాగా రాయండి. డిఫరెంట్ పాయింట్స్ కోసం వేర్వేరు కలర్ పెన్నులు వాడండి. ఇంకా బాగా గుర్తుండాలంటే చిన్న చిన్న బొమ్మలు లేదా ఫ్లో చార్ట్స్ గీసుకోండి. ఈ పద్ధతులను మీ చదువులో అలవాటు చేసుకుంటే, కాన్సెప్ట్స్ క్లియర్‌గా అర్థం కావడంతో పాటు ఎగ్జామ్స్‌లో ఎక్కువ కాలం గుర్తుంటాయి!

©️ VIL Media Pvt Ltd.