
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని కృష్ణా నది ప్రాంతాల్లో టూరిజం యాక్టివిటీస్ పెంచేందుకు మూడు ఫ్లోటింగ్ స్టీల్ పాంటూన్లను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వీటి సప్లై, ఏర్పాటు పనులకు కాంట్రాక్టులు కూడా ఇచ్చినట్లు వెల్లడించింది.
ధర్మపురి దగ్గర గోదావరి ప్రాంతాల్లో ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కోసం ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక (డీపీఆర్) అప్‌డేట్ బాధ్యతను ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అప్పగించినట్లు పేర్కొంది.
ఈ పనులను 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపింది. లోక్‌సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రి సర్బానంద సోనోవాల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.