Reading Time: 2 minutes

నెలకు రూ.లక్షన్నర జీతం.. పోర్చుగల్లో ఉద్యోగం అని చెప్పి.. మహిళను బీర్ షాప్ ఓనర్కు అమ్మేసిన ఏజెంట్స్

Caption of Image.

విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మహిళల అక్రమ రవాణా చేస్తున్న ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పుణెకు చెందిన కన్సల్టెన్సీ హూమన్ ట్రాఫికింగ్ పాల్పడటం సంచలనంగా మారింది. పోర్చుగల్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. తీరా అక్కడికి వెళ్లాక మహిళను అమ్ముకున్నారు దుండగులు. ఈ ఘటనకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. 

నాగ్ పూర్ కు చెందిన 28 ఏళ్ల మహిళను పోర్చుగల్ లో బీర్ షాప్ ఒనర్ కు అమ్ముకున్నారు పుణెకు చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్లు. నెలకు లక్షన్నర జీతం ఇప్పిస్తామని చెప్పి.. విడతల వారీగా 11 లక్షల రూపాయలు కాజేసీ.. చివరికి అమ్ముకోవడం తీవ్రంగా కలచివేసే విషయం. 

పుణెకు చెందిన వి మైగ్రేట్ (We Migrate) అనే కన్సల్టెన్సీకి చెందిన ఇన్స్టాగ్రామ్ యాడ్ చూసి వెళ్లిన మహిళకు పోర్చుగల్ లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు దుండగులు. రోజులో కేవలం 8 గంటలు మాత్రమే పని ఉంటుందని ఆశ చూపించారు. విసా, ఇతర పేపర్ వర్క్ పేరున పదకొండు లక్షల రూపాయలు గుంజేశారు ఆమెతో. 

కన్సల్టెన్సీని నమ్మి వెళ్లిన ఆమె.. పోర్చుగల్ లో లాండ్ అవ్వగానే ఊహించని షాకిచ్చారు ఏజెంట్లు. ఆమె పాస్ పోర్టు గుంజుకుని.. రెండు రోజుల పాటు బంధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత ఆమెను బీర్ షాపు ఓనర్ కు అమ్ముకున్నారు ఏజెంట్లు. అంతే కాకుండా మెంటల్ గా, ఫిజికల్ గా టార్చర్ చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. భరించలేని ఆమె.. తన పాస్ పోర్టు తనకు ఇస్తే వెళ్లిపోతానని చెప్పగా.. మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. 

ఎస్కేప్ ప్లాన్:

ఒక నెల పాటు టార్చర్ అనుభవించిన మహిళ.. ఎస్కేప్ ప్లాన్ వేసింది. దుండగులు లేని సమయంలో బస్సు ద్వారా లిస్బన్ వెళ్లింది. అక్కడి నుంచి మాడ్రిడ్ చేరుకుంది. అటు నుంచి దోహా వెళ్లి అక్కడి నుంచి ఇండియా చేరుకుంది. 

ఇండియాలో ల్యాండ్ అయిత తర్వాత తనకు జరిగిన మోసంపై ప్రశ్నించడంతో.. అది తమకు తెలియకుండా జరిగిందని.. మరో మూడు లక్షల రూపాయలు ఇస్తే మాల్టాలో జాబ్ చూస్తామని చెప్పారు. ఆమె నిరాకరించడంతో. ఆమె భర్తను బెదిరిస్తామని.. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని భయభ్రాంతులకు గురిచేశారు. 

ALSO READ : ఎగిరే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసింది..

చివరికి మహిళ పుణె పోలీసులను ఆశ్రయించారు. మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోపిడీ, మోసం, మహిళల అక్రమరవాణా తదితర కేసులు వి మైగ్రేట్ కన్సల్టెన్సీ ప్రతినిధులపై నమోదు చేసి విచారిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.