Reading Time: < 1 minute

హిమాచల్ ప్రదేశ్ లో లోయలో పడ్డ బస్సు.. డ్రైవర్,కండక్టర్ సహా స్పాట్ డెడ్

Caption of Image.

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవ శాత్తు లోయలో పడింది. శనివారం(ఆగస్టు8) ఉదయం జరిగిన  ఈ దుర్ఘటనలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా తిస్సా, బైరాగడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. బస్సు బైరాగఢ్ నుంచి చంబా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 25  మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 

ALSO READ : 5 స్టార్ హోటల్ లో కూరగాయలపై బూజు.. 

©️ VIL Media Pvt Ltd.