
ఢిల్లీ: UPI యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. P2P UPI లావాదేవీలు ఎప్పటి లాగే ఉచితంగా కొనసాగుతాయని, భవిష్యత్తులో MDR (మర్చంట్ డిస్కౌంట్ రేట్) వచ్చినా వ్యాపారులందరికీ వర్తించదని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. పరిమిత మర్చంట్ ట్రాన్షాక్షన్స్ పైనే నామమాత్రపు MDR ఛార్జీలు ఉంటాయని పేర్కొంది. డెబిట్, క్రెడిట్ కార్డుల MDR కంటే UPI MDR చాలా తక్కువగా ఉంటుందని తెలిపింది.
No Charges for UPI Users. Vast Majority of the Transactions to Remain Free of Charge for Merchants as well. Amendment to the Payment and Settlement Systems Act (PSS Act) an Enabling Provision to Ensure further proliferation of Financial Inclusion, UPI’s Long-Term Sustainability,… pic.twitter.com/7k3vKcKyln
— ANI (@ANI) August 8, 2026
UPI లావాదేవీల్లో ఎక్కువ మర్చంట్ ట్రాన్షాక్షన్స్ ఉచితంగానే కొనసాగుతాయని కేంద్రం ప్రకటించడంతో యూపీఐ యూజర్లకు ఊరట దక్కింది. UPI దీర్ఘకాలిక స్థిరత్వం కోసమే PSS Actను సవరిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. సైబర్ సెక్యూరిటీ, ఫ్రాడ్ నివారణకు భారీ పెట్టుబడులు అవసరం అని, UPIని మరింత విస్తరించేందుకు స్వయం- స్థిరమైన ఆదాయ నమూనా అవసరమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
* జూలైలో 2,366 కోట్ల UPI లావాదేవీలు
* జూలైలో UPI లావాదేవీల విలువ ₹29.9 లక్షల కోట్లు
* 11 విదేశాల్లో అందుబాటులో ఉన్న UPI
* UPI భారత్ సొంత ఆవిష్కరణ: కేంద్ర ప్రభుత్వం
* UPIని దేశ పౌరులకు ఉచితంగా కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యం