
తెలంగాణ బాస్కెట్ బాల్ జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డి పోక్సో కేసులో కీలక పరిణామాం చోటు చేసుకుంది. లైంగిక ఆరోపణల కేసులో పృథ్వీశ్వర్ ని తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది. 2026 ఆగస్టు 8వ తేదీన ఏర్పాటు చేసిన టీబీఏ అత్యవసర సమావేశం లో పృథ్వీశ్వర్ ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పృథ్వీశ్వర్ సస్పెన్షన్ తర్వాత.. అతనిపై చర్యలు తీసుకున్నట్లు అసోసియేషన్ BFI కి లెటర్ పంపింది. జాయింట్ సెక్రటరీ విష్ణు కుమార్ గౌడ్ ని జనరల్ సెక్రటరీగా నియమించినట్లు పేర్కొంది.
మరోవైపు ఫోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని డీజీపీ , సీపీకి ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. ఫోక్సో కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ALSO READ : అంట్లుతోమే పీచు తయారు చేస్తే నెలకు రూ.లక్ష 24 వేలు లాభం..
బాస్కెట్ బాల్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న క్రీడాకారినిపై వేధింపుల జరగడంతో తీవ్ర మానసిక ఆందోళనకు మైనర్ బాలిక గురవుతోందని DGP కి ఫిర్యాదు చేశారు. TBA లో నిందితుడు పృథ్వీశ్వర్ భారీగా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలున్నాయి. దీనిపై విచారణ జరుపుతున్న బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది.