Reading Time: < 1 minute

ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో తీవ్ర నీటి సంక్షోభం..వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు వేయాలి: కలెక్టర్ సత్యప్రసాద్

Caption of Image.

జగిత్యాల టౌన్, వెలుగు: ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం తీవ్రంగా ఉండనుండటంతో జిల్లాలో నీటి సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. వర్షపాతం తగ్గడం వల్ల చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాలు పడిపోతున్నాయని తెలిపారు. జిల్లాలోని 1,010 చెరువుల్లో కేవలం 268 మాత్రమే నిండాయని, భూగర్భ జల మట్టం ఇప్పటికే గతేడాదితో పోలిస్తే సగటున 1.12 మీటర్లు తగ్గిందని వెల్లడించారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిని తాగునీటి అవసరాలు తీర్చేందుకే వాడాల్సి ఉంటుందని.. కొత్తగా వరి నాట్లు వేయవద్దని, సాగు విస్తీర్ణాన్ని పెంచవద్దని కోరారు. తక్కువ నీటితో పండే కందులు, పెసర, మినుములు, ఆముదం, జొన్న, సజ్జలు తగిన తేమ ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు.

©️ VIL Media Pvt Ltd.