
ప్రపంచం అంతా షాకయ్యే న్యూస్ ఇది. అర్జెంటీనా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ హత్యకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 2026 ఫిఫా ప్రపంచ కప్ సందర్భంగా మెస్సీని లేపేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరిగినట్లు రిపోర్ట్స్ రావడం కలకలం రేపుతోంది. స్పానిష్ అవుట్ లెట్ అయిన Informacion.es ప్రచురించిన నివేదిక బయటపెట్టిన నిజాలు అటు క్రీడా రంగంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెస్సీ ఫ్యాన్స్ ను ఆందోళనలో పడేశాయి.
అమెరికా FBI తో పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీల దర్యాప్తులో భారీ ఎత్తున హింసకు పాల్పడేందుకు తీవ్రవాదులు ప్లాన్ చేసినట్లు వెల్లడైంది. ఫిఫా టోర్నమెంట్ జరుగుతుండగా పెద్ద ఎత్తున బాంబులతో దాడి చేసి మెస్సీని అంతం చేయాలని కుట్రపన్నినట్లు నివేదిక వెల్లడించింది. కోచ్ లు, రెఫరీలను కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ హెచ్చరికలు మెస్సీకే వచ్చినట్లు చెబుతున్నారు.
డల్లాస్ లో జరిగిన అర్జెంటీనా-జోర్డాన్ మ్యాచ్ సందర్భంగా తీవ్రవాదులు చేసిన కుట్రలను నివేదిక బయటపెట్టింది. మ్యా్చ్ కు ముందు ఒక గుర్తు తెలియని వ్యక్తి డల్లాస్ ఎయిర్ పోర్టుకు ఫోన్ చేసి.. తనతో పాటు మరో ఇద్దరం కలిసి స్టేడియానికి వెళ్తున్నట్లు హెచ్చరించాడు. ఇంట్లో సొంతంగా తయరు చేసిన నాటు బాంబులు,AR-15 లతో దాడి చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. రెండు టీమ్స్ మెంబర్స్ పైనా.. అదే విధంగా పోలీసులపై అటాక్ చేయనున్నట్లు బెదిరించాడు. ముఖ్యంగామెస్సీని అస్సలు వదలమని హెచ్చరించాడు.
అదే విధంగా అట్లాంటాలో జరిగిన అర్జెంటీనా-ఈజిప్ట్ మ్యాచ్ పైన కూడా కుట్రలు జరిగినట్లు నివేదిక వెల్లడించింది. స్టేడియంకు ఎంటర్ అవుతున్నానని.. మెస్సీని బాంబులతో లేపాస్తానని చెప్పడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
మెస్సీ ఎందుకు టార్గెట్..?
పోలీసు నివేదికల ప్రకారం, మెస్సీకి వ్యతిరేకంగా వచ్చిన బెదిరింపులు కేవలం ఆన్‌లైన్ బెదిరింపులకే పరిమితం కాలేదు. డల్లాస్ ఘటనలో, ఫోన్ చేసిన వ్యక్తి తాను, మరో ఇద్దరు కలిసి ఇంట్లో తయారుచేసిన పేలుడు పదార్థాలు, ఒక AR-15తో స్టేడియం వైపు వెళ్తున్నామని.. మెస్సీనే అసలు టార్గెట్ అంటూ బెదరించారు.
ALSO READ : ప్రజ్ఞానందకు తొలిసారి సెయింట్ లూయిస్ టైటిల్
అట్లాంటాలో ఈజిప్టుతో అర్జెంటీనా మ్యాచ్‌కు ముందు మరో బెదిరింపు వచ్చింది. ఒక వ్యక్తి తమ శరీరానికి నాలుగు బాంబులను కట్టుకుని స్టేడియంలోకి ప్రవేశించి మెస్సీపై దాడి చేయబోతున్నట్లు రాసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
దీంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అట్లాంటా మ్యాచ్ సమయంలో, స్టేడియం లోపల వేర్వేరు డబ్బాలలో మూడు బాంబులు పెట్టారని పేర్కొంటూ పోలీసులకు మరో కాల్ వచ్చింది. దీంతో పేలుడు పదార్థాల నిపుణులు, డాగ్ స్క్వాడ్ శిక్షకులు, K-9 బృందాలను రంగంలోకి దించారు.
క్రిస్టియానో రొనాల్డో కూడా ..
ఈ బెదిరింపులు కేవలం మెస్సీకే కాదు.. టోర్నమెంట్ సమయంలో క్రిస్టియానో రొనాల్డో నిరంతర వేధింపులను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆ నివేదిక ప్రకారం, పోర్చుగల్ కెప్టెన్ ఉంటున్న హోటల్ గురించి సమాచారం కోరుతున్న ఒక అనుమానాస్పద వ్యక్తిని గమనించిన తర్వాత, జూన్ 14న ఒక ఫీఫా ఉద్యోగి హెచ్చరిక జారీ చేశారు. పోర్చుగీస్ జట్టుతో కలిసి రొనాల్డో బస చేస్తున్న హోటల్‌లో, హ్యూస్టన్ పోలీసులు జూన్ 16న ఆ వ్యక్తిని గుర్తించి అరెస్టు చేశారు.
ఈ బెదిరింపులు మ్యాచ్ రెఫరీలు, అంపైర్లకువచ్చాయి. ఫ్రెంచ్ రెఫరీ ఫ్రాంకోయిస్ లెటెక్సియర్‌కు 6,000కు పైగా వాట్సాప్ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.