
‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్, టాలీవుడ్ హీరోయిన్ అవికా గోర్ (Avika Gor) బారినపడి ఆస్పత్రిలో చేరారు. ఐదు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆమెకు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అవికా ఆరోగ్యంపై తన భర్త మిలింద్ అప్‌డేట్ అప్డేట్ ఇస్తూ ఎమోషనల్ అయ్యారు. ఐదు రోజులుగా అవికాకు 103-104 డిగ్రీల వరకు జ్వరం ఉందని, అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆమె వెళ్లిందని తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే బుల్లితెర, వెండితెర ప్రముఖులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో భర్త మిలింద్… అవికా ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చారు. ఐదు రోజులుగా అవికాకు 103-104 డిగ్రీల వరకు జ్వరం ఉందని, అయినప్పటికీ పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆమె వెళ్లిందని తెలిపారు. ఓ ప్రాజెక్ట్‌లో రెండు రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉండటంతో.. 104 డిగ్రీల జ్వరంతోనే అవికా షూటింగ్‌కు హాజరైందని మిలింద్ చెప్పారు. ఆమె అద్భుతంగా పనిచేయడంతో రెండు రోజుల షూటింగ్‌ను ఒక్క రోజులోనే పూర్తి చేశారని తెలిపారు. షూటింగ్ పూర్తయ్యాక అవికాకు రెండు రోజుల విరామం లభించింది. ఆ సమయంలో ఇంట్లోనే మంచంపై విశ్రాంతి తీసుకుంటూ మందులు వేసుకున్నారని మిలింద్ తెలిపారు.
సరిగ్గా కదలలేకపోవడం, ఆహారం తీసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురైనా.. మరో ప్రొఫెషనల్ కమిట్‌మెంట్ కోసం అదే జ్వరంతో ఢిల్లీకి వెళ్లి యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. ఢిల్లీ వెళ్లే ముందు అవికా వైద్య పరీక్షలు చేయించుకున్నారని, ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత రిపోర్టులు పరిశీలించగా డెంగ్యూ పాజిటివ్‌గా తేలిందని మిలింద్ వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా షూటింగ్‌ను వాయిదా వేయవచ్చని నిర్మాతలు అర్థం చేసుకుంటారని తాను పలుమార్లు చెప్పినా.. అవికా మాత్రం తన కమిట్‌మెంట్‌ను పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు.
అవికా పని పట్ల అంకితభావం..
అవికాకు తన పని, నటన పట్ల ఎంతో ప్రేమ ఉందని మిలింద్ ప్రశంసించారు. ఇతరుల సమయం, డబ్బు, వనరుల విలువను కూడా ఆమె ఎంతో గౌరవిస్తుందని చెప్పారు. ప్రస్తుతం అవికా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని మిలింద్ కోరారు. ‘అవికా.. నీ గురించి నేను గర్వపడుతున్నాను’ అంటూ ఆమెకు తన మద్దతు తెలిపారు.
అవికా-మిలింద్ లవ్ స్టోరీ..
అవికా గోర్, మిలింద్ చంద్వానీ 2020లో తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. 2025 జూన్‌లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. అనంతరం 2025 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకలు రియాలిటీ షో ‘పతి పత్ని ఔర్ పంగా’ సెట్స్‌పై జరిగాయి. వెంటనే బుల్లితెర, వెండితెర ప్రముఖులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నారు.