Reading Time: 2 minutes

ఇంట్లో చెప్పులేసుకుంటే దరిద్రం అంటారు కానీ.. దాని వల్ల ఎన్ని లాభాలో తెలుసుకోండి..!

Caption of Image.

చాలా మంది ఇళ్లలో చెప్పులు వేసుకొని తిరగడం పెద్ద తప్పుగా చూస్తుంటారు. కానీ, మారుతున్న కాలంతో పాటు ఈ అలవాటు కూడా మారుతోంది. కొందరు దీనిని సాంప్రదాయంగా భావిస్తే, మరికొందరు ఆరోగ్య ప్రయోజనాల కోసం ఇంట్లోనే స్లిప్పర్లు వేసుకుంటున్నారు. అసలు ఇంట్లో చెప్పులు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం…..

ఇంట్లో చెప్పులు వేసుకోవడం వల్ల కలిగే లాభాలు:
*బయట తిరిగి వచ్చిన బూట్లను నేరుగా ఇంట్లోకి తెస్తే.. నేలపై ఉండే మట్టి, మురికికి, హానికరమైన బ్యాక్టీరియా మన కాళ్ల ద్వారా శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని తప్పుకోవడానికి ఇంట్లో ప్రత్యేకంగా స్లిప్పర్లు వాడటం మంచిది.

గట్టిగా ఉండే టైల్స్ లేదా మార్బుల్ నేలపై ఎక్కువ సేపు నిలబడినా, నడిచినా అరికాళ్లలో విపరీతమైన నొప్పి వస్తుంది. అదే చెప్పులు వేసుకుంటే అవి కాళ్లకు కుషన్ లా పనిచేసి, నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి, పాదాల నొప్పులు తగ్గుతాయి.

మన శరీర ఉష్ణోగ్రతను కాపాడటంలో పాదాలు చాలా ముఖ్యం. చెప్పులు లేకుండా చల్లటి నేలపై ఎక్కువ సేపు ఉంటే శరీరం చల్లబడిపోతుంది. దీనివల్ల ముఖ్యంగా సైనస్ సమస్య ఉన్నవారికి తరచూ జలుబు చేసే అవకాశం ఉంది ఇంకా చలి నుంచి రక్షణగా ఉంటుంది. 

ALSO READ : కనుబొమల్లో తెల్లని డస్ట్.. అది సబ్బు కాదు చుండ్రు! 

 ఇంట్లో చెప్పులు లేకుండా నడిచేటప్పుడు అనుకోకుండా కాలుజారడం లేదా నేలపై చిన్న విరిగిన వస్తువు  ఉన్న,  గాజు పస్తువులు ఉన్న,  పదునైన వస్తువులు గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. స్లిప్పర్లు వేసుకుంటే ఇలాంటి గాయాల నుంచి కాపాడుకోవచ్చు అలాగే గాయాలవకుండా జాగ్రత్త పడొచ్చు.  

ఇంటి లోపల నడక కోసం వేరే చెప్పులు వాడటం వల్ల దుమ్ము, క్రిములు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దీనివల్ల ఇల్లు కూడా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటుంది.

ఎవరు చెప్పులు వేసుకోవాలి ? ఎవరు వేసుకోకూడదు?
మీ శరీరం బలహీనంగా ఉన్నా, లేదా బొటనవేలి వాపు, మడమ నొప్పులు, కాలి వేళ్ల సమస్యలతో బాధపడుతున్నా పొరపాటున కూడా ఇంట్లో చెప్పులు లేకుండా నడవకండి.

ఒకవేళ మీకు కాళ్లకు సంబంధించిన ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేకపోతే మాత్రం.. అప్పుడప్పుడు ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వల్ల కాళ్ల బలం, శరీర బ్యాలెన్స్ మెరుగుపడతాయి అలాగే మీ పాదాలు బలపడతాయి.

 

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.