Reading Time: < 1 minute

మనతెలంగాణ/మాదాపూర్ : ఒంటిపై కిలోల కొద్దీ బంగారు ఆభరణాలతో తిరిగే బంగారుబాబుకు ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లగా ఢిల్లీ ఎ యిర్‌పోర్టులో అనుమానం వచ్చి ఆదాయం పన్ను శాఖ అధికారులు అడ్డుకున్నారు. సుమారు నాలుగున్నర కిలోలకు పైగా ఉన్న ఈ ఆభరణాల విలు వ రూ.7 కోట్లకుపైగా ఉండటంతో ఐటి అధికారు లు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించా రు. ఇందుకు సంబంధించిన బిల్లులు చూపించాలని అధికారులు కోరగా బిల్లులు హైదరాబాద్‌లో ఉన్నాయని, ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వ చ్చానని,

తర్వాత బిల్లులు ఇస్తానని చెప్పడంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వదిలినట్లు సమాచారం. శేరిలింగంపల్లి చందానగర్‌కి చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర హాకీ చైర్మన్ కొండా విజయ్ కుమార్ న్యూఢిల్లీలో జరుగుతున్న హకీ ఇండియా అవార్డుల ప్రదానోత్సవానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లారు. వంటినిండా బంగారంతో కనిపించిన ఆయనను ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదాయపుపన్ను అధికారులు గురువారం నాడు అడ్డుకున్నారు. బంగారం గు రించి ఆరా తీశారు. ఈ మేరకు రెండు గొలుసుల ను తీసుకుని వాటికి సంబంధించిన బిల్లులు చూ పించాలని నోటీసులు ఇచ్చారు. అనంతరం న్యూ ఢిల్లీలో జరిగిన హకీ ఇండియా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న అనంతరం శుక్రవారం సా యంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.