Reading Time: < 1 minute

ఆలయ అభివృద్ధికిసహకరిస్తా..జగిత్యాల జిల్లా బొంకూర్ లోని వేంకటేశ్వరస్వామిఆలయంలో  మంత్రి ప్రత్యేక పూజలు

Caption of Image.

గొల్లపల్లి, వెలుగు: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల, బొంకూర్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్  తెలిపారు. ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయ పూజారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు అన్ని సౌలతులు కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్  సంతోష్, సర్పంచులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.