Reading Time: < 1 minute

మేడిపల్లి కాచవానిసింగారంలో దొంగల బీభత్సం..

Caption of Image.
  • మూడు ఇండ్ల తాళాలు పగలగొట్టి.. ఒక ఇంట్లో లూటీ

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లిలోని కాచవానిసింగారంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.  ఈస్టర్న్ గ్రీన్ హోమ్స్ కాలనీలో మూడు ఇండ్ల తాళాలు పగలగొట్టిన చోరీకి పాల్పడ్డారు. బొబ్బల శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కుటుంబసభ్యులతో కలిసి స్వగ్రామం కరీంనగర్​కు వెళ్లగా, ఇంట్లోని రెండు జతల బంగారు కమ్మలు, లాకెట్, 14 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లారు. అదే కాలనీలోని ఎల్లేశ్, వెంకట్ రెడ్డి ఇళ్లలో కూడా దొంగలు బీరువాలు పగలగొట్టి సోదా చేసినప్పటికీ విలువైన వస్తువులేవీ దొరకకపోవడంతో వెనుదిరిగారు. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.