Reading Time: < 1 minute
A Major Blunder In Dhurandhar Cameraman Spotted In Frame Viral Debate Ignites On Social Medi

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. అయితే, సినిమా ఇంతటి ఘనవిజయం సాధిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో జరిగిన పొరపాటు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయింది.

 Also Read : Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

 సినిమాలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనించే  నేటి తరం ప్రేక్షకులు ఒక ఫైట్ సీక్వెన్స్‌లో ఒక చిన్న లోపాన్ని గుర్తించారు. అసలు విషయమేంటంటే భారీ యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ చేస్తున్న కెమెరామెన్ కూడా కొన్ని సెకన్ల పాటు ఫ్రేమ్‌లో కనిపించాడని నెటిజన్లు స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. జూమ్ చేసిన ఈ క్లిప్పులు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో ఇటువంటి పొరపాటు ఎలా జరిగిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరల్ క్లిప్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది దర్శకుడు ఆదిత్య ధర్ గమనించని ఎడిటింగ్ లోపం అని అంటుంటే, మరికొందరు మాత్రం ఇది కేవలం సాంకేతిక కారణాల వల్ల జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్ కోసం AI ను ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇది ఏఐ చేసిన పొరపాటేనని మరికొంతమంది వాదిస్తున్నారు.ప్రస్తుతానికి ఈ వివాదంపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ‘ధురందర్’ లాంటి పర్‌ఫెక్ట్ యాక్షన్ సినిమాలో ఈ చిన్న “బ్లండర్” ఇప్పుడు నెటిజన్లకు ట్రోల్ మెటీరియల్ దొరికినట్టు అయింది.