Reading Time: 2 minutes
India Budget Dahi Chini Tradition

India Budget Tradition:భారతదేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్‌ను నేడు ( ఫిబ్రవరి 1న) పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌ అనేది కేవలం ప్రభుత్వ ఖర్చుల ప్రకటన మాత్రమే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ దేశ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. కాగా, 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.11. 24 లక్షల కోట్లతో కూడిన బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 7.9 శాతం వృద్ధిగా అంచనా వేస్తున్నారు.

Read Also: Union Budget 2026 live Updates: దేశం చూపు పార్లమెంట్‌పై.. ట్యాక్స్ ఊరట వస్తుందా? లైవ్‌ అప్డెట్స్ మీకోసం..

బడ్జెట్‌కు ముందు దహి-చీనీ వేడుక:
భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, శుభ సంకేతాలతో ముడిపడి ఉంటాయి. ప్రతి ఏడాది ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్ కి ముందు పెరుగు-చక్కెర (దహీ- చినీ) వేడుక ప్రత్యేక సంప్రదాయంగా వస్తుంది. బడ్జెట్ ప్రవేశానికి ముందుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి రాష్ట్రపతిని కలుసుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి పెరుగు-చక్కెర (దహీ- చినీ)ని తినిపించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే, భారతీయ సంప్రదాయంలో పెరుగు, చక్కెర శుభప్రదం, విజయానికి సంకేతంగా భావిస్తారు. ఈ ఆచారం బడ్జెట్ విజయవంతంగా పూర్తవాలని, దేశ ఆర్థిక ప్రయాణం సజావుగా కొనసాగాలని ఆశిస్తూ నిర్వహించబడుతుంది.

Read Also: Jowar Biscuit Recipe: ఇంట్లోనే క్రంచీ క్రంచీ జొన్న పిండి రుచికరమైన బిస్కెట్స్ ఇలా చేసేయండి!

బడ్జెట్ ప్రవేశాల రికార్డు:
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టే బడ్జెట్‌ మరో కీలక మైలురాయిని చేరుకోనుంది. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తిగా మాజీ ప్రధాని మొరార్జీ దేసాయ్ రికార్డు కొనసాగుతోంది. ఆయన మొత్తం 10 బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. 1959 నుంచి 1964 మధ్యకాలంలో ఆర్థిక మంత్రిగా ఆరు బడ్జెట్లు, 1967 నుంచి 1969 మధ్య నాలుగు బడ్జెట్లు ప్రవేశ పెట్టారు. ఇక, రెండో స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఉన్నారు. ఆయన మొత్తం 9 బడ్జెట్లు ప్రవేశ పెట్టగా.. నేటి బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ పి.చిదంబరం రికార్డును సమానం చేయనున్నారు. మొరార్జీ దేసాయ్ చారిత్రక రికార్డుకు మరో అడుగు దూరంలోనే ఆమె ఉన్నారు. కాగా, దేశ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి, మధ్య తరగతి ఆశలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలపై ఈ బడ్జెట్ కీలక ప్రభావం చూపనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.