Reading Time: < 1 minute

మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

Caption of Image.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఈరోజు(జనవరి 30)ముగిసింది.   సాయంత్రం 5గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న అభ్యర్థులకు నామినేషన్లు వేయడానికి చాన్స్ ఇస్తారు.  జనవరి 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.అదే రోజు ఫైనల్ అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఈసీ.  ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా.. 13న కౌంటింగ్ జరుగుతుంది. 

మున్సిపల్ ఎన్నికల్లో52 లక్షల ఓటర్లు

 రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళలు 26.80 లక్షలు, పురుషులు 25.62 లక్షలు, ఇతరులు 640 మంది ఉన్నారు. మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఫిబ్రవరి  3 వరకు విత్ డ్రాలు నిర్వహించి అదే రోజు అభ్యర్థులకు  గుర్తులను కేటాయిస్తారు. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 48 గంటల ముందే ప్రచారం ముగుస్తుంది. అంటే వచ్చే ఫిబ్రవరి 9వ తేదీన ప్రచారం బంద్ అవుతుంది. ఈ లెక్కన అభ్యర్థులు కేవలం ఆరు రోజులు మాత్రమే ప్రచారం చేయాల్సి ఉంటుంది.

©️ VIL Media Pvt Ltd.