
అమరావతి: కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒఎన్ జిసి పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి మంటలు ఎగసిపడ్దాయి. మంటల ధాటికి ఒఎన్ జిసి సిబ్బంది, గ్రామస్తులు భయాందోళనతో పరుగులు పెట్టారు. ఇరుసుమండ గ్రామాన్ని పొగకమ్మేసింది. వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. సమీప గ్రామాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. లక్కవరం కల్యాణమండపానికి 300 కుటుంబాలు తరలించారు. సంఘటనా స్థలిని జిల్లా కలెక్టర్ పరిశీలించగా.. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం ఇచ్చారు. మంటలను అదుపు చేసేందుకు ఒఎన్ జిసి అధికారులు యత్నించారు.