Reading Time: < 1 minute

1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా హేమ సుందర్ దర్శకత్వంలో, సచేతన్‌రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ ‘రిమ్జిమ్’. స్నేహం, ప్రేమ కథగా రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. ‘సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నాం. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దాం. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించగా, ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి’ అని తెలిపారు. ప్రధాన పాత్రలో అజయ్ వేద్, హీరోయిన్‌గా వ్రజన నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ కనిపించనున్నారు.