
తిరువనంతపురం: కేరళ.. త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షెడ్‌లో పార్క్ చేసిన సుమారు 400 బైక్‌లు, కార్లు ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటన్నరపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగల నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అక్కడ ఉన్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.