Reading Time: < 1 minute

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘రాజా సాబ్’. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ‘రాజా సాబ్‘ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ‘రాజా సాబ్‘ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అన్ని పాటలు కూడా ఆడియెన్స్‌ని అలరించాయి. ఇక నెక్స్ సాంగ్ రిలీజ్‌కి తమన్ డేట్‌ని తెలియజేశాడు. అంతే కాకుండా ఇందులో ప్రభాస్ స్టైలింగ్, కాస్ట్యూమ్స్ కూడా అదిరిపోతాయని చెబుతున్నాడు. నాచో నాచో అంటూ సాగే నెక్స్ సాంగ్‌ని జనవరి 5న రిలీజ్ చేస్తున్నట్టు తమన్ తెలిపాడు. ఇప్పటికే ఫస్ట్ సాంగ్ లో డార్లింగ్ స్టెప్పులు చూసి వింటేజ్ ప్రభాస్ ని మళ్ళీ చూశామని ఫ్యాన్స్ చెప్పారు. ఇక మరోసారి అదే తరహాలో నాచో నాచో పాటలో మరింత ర్యాంపేజ్‌ని సెట్ చేయవచ్చు.