Reading Time: < 1 minute

రాంఛీ: పోలీస్ స్టేషన్‌లో డ్రగ్స్ తయారు చేసే ఓపియం పౌడర్‌ను ఎలుకలు తినేశాయి. దీంతో నిందితులను కోర్టు విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం రాంఛీలో నామ్‌కుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదక ద్రవ్యాల తయారు చేయడంతో ఓపియం పౌడర్‌ను వాడుతారు. ఇద్దరు వ్యక్తులు ఓపియం పౌడర్‌ను తీసుకెళ్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి 45 సంచుల్లో 675 కిలోల డోడా పౌడర్(ఓపియం పౌడర్) ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచారు. కోర్టులో కేసు విచారణ జరుగుతుండగా 45 సంచుల్లో పౌడర్ లేకపోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. పోలీస్ స్టేషన్‌లో ఆవరణంలో ఉండే ఎలుకలు ఓపియం పౌడర్‌ను స్వాహ చేసినట్టు వెలుగులోకి వచ్చింది. నిందితులను రక్షించడానికి పోలీసులలో కొందరు ఈ పని చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు ఇద్దరు నిందితులను విడుదల చేసింది