Reading Time: < 1 minute

న్యూ ఢిల్లీ: స్థానిక రైల్వే స్టేషన్‌లో నూతన శ్రేణి వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ శనివారం పరిశీలించారు. బోగీలలో కలియతిరిగారు. వాటిలోని అధునాతన సౌకర్యాలు, ఏర్పాట్లను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అతి త్వరలోనే ఈ స్లీపర్ రైలు ఒకటి గువహతి కోల్‌కతా మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. సమున్నత ప్రమాణాలతో, విశాలమైన ట్రే హోల్డర్లతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు ఉన్నాయని రైల్వే మంత్రి మీడియాకు తెలిపారు.

సర్దుబాట్లకు వీలైన కిటికీ అద్దాలు, రీడింగ్ లైట్లు, రాత్రిపూట ప్రయాణానికి అనువైన పలు ఏర్పాట్లు పరిశీలించారు. సరైన వాష్ బేసిన్లు, చదువుకునేందుకు వీలైన హోల్డర్లు వంటివి కోచ్‌లలో ఉన్నాయి. 16 కోచ్‌ల ఈ వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలపైకి వెళ్లుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ తొలి రైలును నిర్ణీత మార్గంలో ఆరంబిస్తారని కూడా తెలిపారు. ఏక కాలంలో రైళ్లు కోల్‌కతా, గువహతి మధ్య నడుస్తాయని వివరించారు. దృష్టిలోపం ఉన్న వారు కూడా తమ సీట్లను సరిగ్గా తెలుసుకోవడానికి వీలుగా బ్రెయిలీ లిపిలో నెంబర్లు అమర్చారని మంత్రి చెప్పారు.