
రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ‘తలైవర్173’ మాగ్నమ్ ఓపస్‌కు దర్శకుడిని ప్రకటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చే ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహిస్తారు. ఇది నెక్స్ లెవెల్ సినిమాటిక్ గ్రాండియర్‌గా ఉండబోతోంది. రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మాణంలో ‘తలైవర్173’ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ లెగసీ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోనుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్‌తో ప్రేక్షకులని అలరించబోతోంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది. త్వరలోనే తారాగణం, టెక్నికల్ టీం గురించి మరిన్ని వివరాలను తెలియజేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు స్పెషల్ ట్రీట్ గా ‘తలైవర్173’ 2027 పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.