
అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) వలలో మరో అవినీతి చేప చిక్కింది. లంచం తీసుకుంటూ ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఎసిబి అధికారులకు పట్టబడ్డాడు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు చెందిన కొత్తగూడెం అటవీ అధికారి ఒకరు ప్రజలను లంచాలు డిమాండ్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఓ వ్యక్తి నుంచి సదరు అటవిశాఖ అధికారి రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా ఖమ్మం ఎసిబి డీఎస్పీ వై. రమేష్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సదరు అధికారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎసిబి తెలిపింది.